Chiru : జక్కన్నతో చేయలేను

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం “గాడ్ ఫాదర్”. లూసిఫర్ కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సునీల్, సముద్రఖని, కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీ విజయదశమి సందర్భంగా ప్రేక్షకులం ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇటీవల అనంతపురంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. భారీ వర్షం కురుస్తున్నా కూడా అభిమానుల కేకలు, కేరింతల నడుమ ఈ కార్యక్రమం మరింత రెట్టింపు ఉత్సాహంతో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకదీరుడు రాజమౌళి గురించి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి ఒక గొప్ప డైరెక్టర్, ఆయన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. కానీ ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక మాత్రం తనకు లేదని చిరు అన్నారు.

ఒక సినిమాని తెరకెక్కించేందుకు ఆయన చాలా సమయం తీసుకోవడమే అందుకు గల కారణమని తెలిపారు. రాజమౌళి ప్రతి విషయాన్ని చాలా డీప్ గా చూస్తారని.. ఆయన కోరుకున్న అవుట్ ఫుట్ ని ఇవ్వగలనో లేదో తనకు తెలియదన్నారు. ఆయన ఒక సినిమాతో మూడు నుంచి ఐదు ఏళ్ళు ప్రయాణిస్తారని.. తాను ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అందుకే ఆయనతో పని చేయాలని, పాన్ ఇండియా నటుడిగా గుర్తింపు పొందాలని లేదంటూ నవ్వుతూ వివరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు