Driver Jamuna : వాయిదా వేశారు

సౌత్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్న హీరోయిన్స్ లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ముందుగా సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన ఐశ్వర్య, తర్వాత హీరోయిన్ గా కూడా అవకాశాలు కొట్టేస్తోంది. ఐశ్వర్య తెలుగు తెరకు కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో పరిచయమైంది. తర్వాత టాలీవుడ్ లో అవకాశాలు బాగానే వచ్చాయి. అంతే కాదు.. సౌత్ లో కూడా వరుసగా సినిమా ఛాన్స్ లు దక్కించుకుంది. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో 9 తమిళం, 3 మలయాళం సినిమాలు ఉన్నాయి.

ఈ లిస్ట్ లో డ్రైవర్ జమున ఒకటి. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా. కిన్‌స్లిన్‌ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్‌పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. దీనిలో ఐశ్వర్య రాజేష్ కారు డ్రైవర్ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలో 90 నిమిషాల కార్ రైడ్ ఉండబోతుంది. కాగా సినిమాను ముందుగా నవంబర్ 11న విడుదల కాబోతుందని మూవీ టీం అధికారికంగా ప్రకటించారు. కానీ సినిమాను వాయిదా వేస్తున్నట్టు బుధవారం చిన్నగా రూమర్స్ వచ్చాయి. తాజాగా విడుదల వాయిదాపై గురువారం టీం అధికారిక ప్రకటన చేశారు.

డ్రైవర్ జుమున సినిమాను ఈ నెల 11న విడుదల చేయలేకపోతున్నట్టు ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ ను అతి త్వరలోనే ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. కాగా ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు