Dhamaka : డు.. డు.. అప్డేట్

ప్రేక్షకుల్లో జోష్ నింపేందుకు “ధమాకా” మూవీతో రవితేజ రెడీ అవుతున్నారు. రవితేజ మార్క్ కామెడీ అంశాలతో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శ్రీలీల నటిస్తోంది. పెళ్లి సందడితో కథానాయకగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీలకు ఇది రెండో సినిమా. ప్రసన్నకుమార్ బెజవాడ కథను అందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ధమాకా సాంగ్ ఆడియన్స్ ను అలరించి సినిమాపై అంచనాలను పెంచేసాయి. తాజాగా మరో అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా నుంచి డు, డు.. అంటూ సాగే ప్రోమో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ ఫుల్ సాంగ్ ను నవంబర్ 25న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా వరుస ప్లాప్ లతో రవితేజ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. క్రాక్ సినిమా తర్వాత రవితేజ ఖాతాలో ఇప్పటివరకు మంచి హిట్ పడలేదు. ఇక ఈ ధమాకా సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని రవితేజ ఎదురుచూస్తున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు