F3: ఆ కామెడీ ఆకట్టుకుంటుందా.?

సినిమా అంటే కొందరికి విజ్ఞానం, దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు అని కొంతమంది నమ్ముతారు.
అలానే సినిమా అంటే చాలామందికి వినోదం, థియేటర్ కి వచ్చామా కాసేపు నవ్వుకున్నామా వెళ్లిపోయామా అనేది కొంతమంది అభిప్రాయం.
కేవలం ఇలాంటి ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే దర్శకులు ఉంటారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు.

పటాస్ సినిమాతో స్టార్ట్ అయిన ఈయన జర్నీ లో చేసిన ప్రతి సినిమా మంచి ఫలితాన్ని ఇచ్చింది. కానీ ప్రతి దర్శకుడు కెరియర్ లో గుర్తుండిపోయే సినిమా ఒకటి ఉంటుంది. అలా అనిల్ రావిపూడి కెరియర్ లో అయితే అలాంటి సినిమా పడలేదు అనే చెప్పొచ్చు.

ఒకప్పుడు ప్రేక్షకులకు సినిమా ఒక్కటే వినోదం, ఇప్పుడు అలా కాదు.
ఇంట్లో కూర్చుని టీవీ రీమోట్ నొక్కితే 10 నుంచి 20 ప్రోగ్రామ్స్ వస్తాయి.
అవి చూస్తూ నవ్వుకోవచ్చు, అదే రకమైన కామెడీను వెండితెరపై ఆవిష్కరిస్తే చూస్తారు, ఆదరిస్తారు అని అనిల్ రావిపూడి చేసిన “ఎఫ్2” సినిమా ప్రూవ్ చేసింది.ఈ సినిమా మంచి హిట్ అయినా ఒక వర్గపు ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చలేదు.

- Advertisement -

అదే తరహాలో ఇప్పుడు “ఎఫ్3” సినిమా కూడా వస్తుంది. ఈ సినిమాని కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించినా, మిగతా యూత్ కి నచ్చుతుందా.? అప్పుడు పండగ సీజన్ కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్స్ కి వచ్చారు ఇప్పుడు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారా.? అనే ప్రశ్నలకి సమాధానం ఈ సినిమా ఫలితం ఇవ్వనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు