F3 : ఎఫ్-3ని వీడని భయం !

సినిమాలు రిలీజ్ అయ్యే సమయంలో దర్శక నిర్మాతలకు టెన్షన్ ఉండటం కామన్. రోజుల తరపడి చేసిన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా..? మంచి ఓపెనింగ్స్ వస్తాయా.? అనే డౌట్స్ తో డైరెక్టర్, ప్రొడ్యూసర్ లను వెంటాడుతాయి. ప్రస్తుతం రేపు రిలీజ్ కాబోయే ఎఫ్ 3 కి కూడా ఇదే భయం ఉంది. అయితే ఈ మూవీ టీంకు, కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. దానికి కారణం.. జూన్, జులై.

ఈ రెండు నెలల్లో సినిమాలు పెద్దగా ఆడేట్టు కనిపించడం లేదు. థియేటర్స్ లో ఉన్న సినిమాలకు వచ్చిన కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. జూన్, జూలై కాకుండా దీనికి ముందు.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి తొలి సారి నటించిన “ఆచార్య” మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 29న రిలీజైంది. ఈ మూవీకి మే నెలలో దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. చివరికి ఈ మూవీ ఓ పెద్ద డిజాస్టార్ గానే నిలిచింది.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు-పరశురామ్ కాంబోనేషన్ లో “సర్కారు వారి పాట” మూవీ మే 12న రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ ను వసూళ్లు చేయడంలో విఫలమైంది. తర్వాత కాస్త పుంజుకుని మంచి కలెక్షన్లను రాబట్టింది. కానీ ఓపెనింగ్ లోటు మాత్రం అలాగే ఉంది.

- Advertisement -

ఈ సినిమాలకు ఎదురైన అనుభవాలను చూసి, తమ సినిమాకు కూడా ఓపెనింగ్స్ వస్తాయా..? అని ఎఫ్3 మూవీ యూనిట్ తెగ టెన్షన్ పడుతుందట. నిజానికి ఓ సినిమాకు ఓపెనింగ్స్ చాలా కీలకం. తొలి రెండు రోజుల్లో వచ్చే టాక్, కలెక్షన్ల ఆధారంగానే సినిమా ఫలితం ఉంటుంది.

కాగా, ఎఫ్3 మూవీ కామెడీ కాన్సెప్ట్ కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారా..? లేదా తక్కువ ఓపెనింగ్స్ తో అపజయాన్ని మూటగట్టుకుంటారా..? అంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు