NTR30 : ఎట్టకేలకు అనౌన్స్ మెంట్

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా NTR30. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ ఆచార్య డిజాస్టార్ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ లో ఒకరకమైన ఆందోళన కూడా ఉంది. ఇదిలా ఉండగా NTR30 అనౌన్స్ మెంట్ వచ్చి దాదాపు ఏడు నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి రూమర్స్ రావడమే గానీ, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

దీంతో తారక్ చాలా రోజుల నుంచి NTR30 నుంచి అప్డేట్ ఇవ్వాలని, కనీసం షూటింగ్ స్టార్ట్ డేట్ అయినా చెప్పాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మూవీ యూనిట్ దీనిపై స్పందించి, NTR30 నుంచి అప్డేట్ ఇచ్చింది. న్యూ ఇయ‌ర్ రోజున NTR 30 నుంచి ఫ్యాన్స్‌ ద‌ర్శ‌క నిర్మాత‌లు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి, షూటింగ్ స్టార్ట్ కాబోయే డేట్ ను, సినిమా విడుదలయ్యే డేట్ ను అనౌన్స్ చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో NTR30 షూట్ ప్రారంభమవుతుందని ఈ పోస్టర్ లో ఉంది. అలాగే ఏప్రిల్ 5, 2024లో ఎన్టీఆర్ 30 చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. అందులో క‌త్తులు ప‌ట్టుకున్న తార‌క్ చేతులు మాత్రం క‌నిపిస్తున్నాయి. ‘వెన్ కరేజ్ టర్న్స్ ఏ డిసీజ్.. ఫియర్ ఈజ్ ది ఓన్లీ క్యూర్’ అంటూ క్యాప్షన్ కూడా పోస్టర్ ఉంది.

- Advertisement -

పాన్ ఇండియా మూవీగా NTR 30 చిత్రాన్ని తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సినీ ఇండ‌స్ట్రీలో టాప్ టెక్నీషియ‌న్స్‌గా పేరున్న సినిమాటోగ్రాఫ‌ర్ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర ప్ర‌సాద్ ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ ఈ చిత్రాకి సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు