VT 12 : టైటిల్, ఫస్ట్ పోస్టర్ కు ముహూర్తం ఫిక్స్

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది కుర్రాళ్ళు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్ తో పాటు స్టార్ డమ్ ను అందుకున్నారు. అలాంటి వారిలో నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడన్న విషయం తెలిసిందే. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ కుర్రాడు, స్టార్ గా ఎదుగుతున్నాడు. దీంతో వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు. అంతేకాదు, కొంత కాలంగా కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు.

అయితే వరుణ్ కి గతేడాది ‘గని’ తో అంతగా శుభారంభం దక్కకపోయినా, ‘ఎఫ్-3’ తో తిరిగి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. అయినప్పటికీ మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రాలను వరుసగా అనౌన్స్ చేసి అభిమానులు ఆసక్తిని పెంచుతున్నాడు. మెగా యంగ్ అండ్ డైనమిక్ వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ప్రస్తుతం VT 12 సినిమా చేస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుంచి చాలా మంచి స్పందన వచ్చింది.

ప్రస్తుతం లండన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అయితే, తాజాగా VT12 పేరుతో తెరకెక్కుతున్న వరుణ్ తేజ్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను ఈ నెల 19న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను వదిలారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా, తన 13వ సినిమాను కూడా వరుణ్ ఇప్పటికే ప్రకటించాడు.

- Advertisement -

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రాబోతున్న ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ హడా రూపొందిస్తున్నాడు. ఎయిర్ ఫోర్స్ వార్ బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ రాబోతుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు