Samantha : ప్రమోషన్లకు బిగ్ ప్లాన్

హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు, సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఈమె ముఖ్య పాత్రలో చేసిన లేడీ ఓరియంటెడ్ చిత్రాలు యశోద, శాకుంతలం. ఇందులో యశోద సినిమా న‌వంబ‌ర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ చిత్తాన్ని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో హరి-హరీష్ స్వీయ రచన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 27న సాయంత్రం 5:36 గంటలకు ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. తెలుగు, తమిళం తో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ మూవీ కన్నడ, మలయాళం, తమిళ, హిందీ వెర్షన్ ట్రైలర్ ను  స్టార్ హీరోలు లాంచ్ చేయనున్నారు.

యశోద ట్రైలర్ ను తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కన్నడలో హీరో రక్షిత్ శెట్టి, మలయాళంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళంలో  స్టార్ హీరో సూర్య, బాలీవుడ్ లో హీరో వరుణ్ ధావన్  అక్టోబ‌ర్ 27న సాయంత్రం 5.36 గంట‌ల‌కు లాంచ్ చేయనున్నట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. యశోద నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. మరోవైపు హిందీలో వరుణ్ ధావన్ తో కలిసి వెబ్ సిరీస్ కూడా చేస్తోంది స‌మంత‌. దీంతో పాటు విజయ్ దేవరకొండ తో ఖుషి లో నటిస్తోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో ‘శాకుంతలం’ చేస్తుండగా.. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తయింది. య‌శోద సినిమా ఎలా ఉండ‌నుందో తెలియాలంటే మాత్రం న‌వంబ‌ర్ 11 వ‌ర‌కు వేచి ఉండాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు