Gabbar Singh: ప్రభంజనానికి పదకొండు ఏళ్ళు

జానీ సినిమా తర్వాత
పదేళ్లు హిట్ లేదు
అయినా ఇమేజ్ చెక్కు చెదరలేదు,
రెండేళ్లకు ఒక సినిమా
అయినా ఓపెనింగ్స్ కు డోకా లేదు,
ఆయన సినిమా వస్తే చాలు
దానికి హిట్టు ప్లాప్ తో సంబంధం లేదు.
అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే.
కానీ అభిమానులకి మాత్రం ఎక్కడో చిన్న అసంతృప్తి సరైన సినిమా పడట్లేదు కళ్యాణ్ కి అని.
ఆయన సినిమా రిలీజ్ అయిన ప్రతీసారి ఎన్నో ఆశలతో సినిమాకి వెళ్లడం, ఒక అబద్ధపు నవ్వు తో బయటకు రావడం.
గబ్బర్ సింగ్ ముందు వరకు ఇదే జరిగింది.

గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమాలు ప్లాప్ అయినా కొద్ది పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ పెరుగుతూ వెళ్ళింది. క్రేజ్ కూడా అంతకు మించి పెరుగుతూ వచ్చింది. వరుస ఫెయిల్యూర్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా మంచి హిట్ అయింది.
అప్పటివరకు జానీ సినిమా తరువాత సరైనా హిట్ లేని పవన్ కెరియర్ కు, ఇటు త్రివిక్రమ్ కెరియర్ కు మంచి ప్లస్ అయింది జల్సా. అయినా ఎక్కడో చిన్న అసంతృప్తిని ఆ తరువాత వచ్చిన సినిమాలు కూడా అంతంత మాత్రమే. 2012 మే 11 రిలీజ్ అయినా గబ్బర్ సింగ్ పవన్ కెరియర్ లో ఒక పవర్ఫుల్ కం బ్యాక్.

ఒక సగటు అభిమాని పవన్ కళ్యాణ్ ను ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించాడు హరీష్ శంకర్. ఈ సినిమాలో హరీష్ రాసిన డైలాగ్స్ పవన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. “నేను ట్రెండు ఫాలో అవ్వను ట్రెండు సెట్ చేస్తా” అని డైలాగ్ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ కి కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నేటికీ పదకొండేళ్లు పూర్తి చేసుకున్న ఆ గబ్బర్ సింగ్ సినిమా ఇప్పటికి ఒక పాజిటివ్ ఎనర్జీ. చాలా ఏళ్ల తరువాత ఒక మాస్ ఫిలిం ఇచ్చాడు హరీష్.

- Advertisement -

హరీష్ శంకర్ కి దర్శకుడుగా మొదటి సినిమా “షాక్” ఇచ్చింది. రెండో సినిమాకి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆఫర్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడు. కానీ స్క్రిప్ట్ లో ఇన్వాల్వమెంట్ ఎక్కువ. అప్పటికీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ చాలా వరకు తీసుకున్నాడు. ఈయన ఏదైనా చెబుతుంటే ప్రొడ్యూసర్ ఇదివరకే తీసిన బ్లాక్ బస్టర్ సినిమాలు గురించి చెబుతున్నాడు.
ఆ ఆర్గ్యుమెంట్స్ కాస్తా గొడవకు దారితీసాయి.

రేపు పదివేలు రూమ్ రెంట్ కట్టాలి. చేతిలో రూపాయి లేదు. ఎదురుగా పది లక్షలు రూపాయిల చెక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్న ప్రొడ్యూసర్. ఈగో కి సెల్ఫ్ రెస్పెక్ట్ కి తేడాను గ్రహించి సినిమాని వదిలేసాడు. అది పొగరు అని కొందరంటారు. కాదు గట్ ఫీలింగ్ అని హరీష్ శంకర్ నమ్మాడు.
మొత్తానికి తన రెండో ప్రాజెక్ట్ మిరపకాయ్ తో హిట్ అందుకుని, గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ మూట కట్టుకున్న హరీష్ శంకర్ అంటే పవన్ అభిమానులకి ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకే పవన్ చేస్తున్న అన్ని సినిమాలు కంటే “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాపై అంచనాలు ఎక్కువ ఉన్నాయ్.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు