Gautham Menon : మహేష్ తో పక్కా

కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ గురించి తెలియని వారు ఉండరు. ఈయన తెలుగులో ‘ఘర్షణ’ తో పాటు ‘ఏ మాయ చేశావే’ ‘ఎటో వెళ్ళిపోయింది మన’సు వంటి ప్రేమ కథలను తెరకెక్కించారు. గౌతమ్ మీనన్.. ఒక డైరెక్టర్ గానే కాకుండా విలక్షణమైన పాత్రలను కూడా పోషిస్తారు. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతా రామం’ సినిమాలో గౌతమ్ మీనన్ నటించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పలు వెబ్ సిరీస్ ల్లోనూ గౌతమ్ మీనన్ విలక్షణమైన పాత్రల్లో కనిపించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో గౌతమ్ మీనన్ ఒక సినిమా చేస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. స్టోరీకి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తల పై గౌతమ్ మీనన్ తాజాగా స్పందించారు. తాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తప్పకుండా చేస్తానని, అది ఎప్పుడైనా రావచ్చు అని తెలిపారు.

గతంలోనే ఏ మాయ చేశావే స్టోరీని మహేష్ బాబు కు చెప్పినట్లు వెల్లడించారు. అయితే తమ కాంబినేషన్ లో వచ్చే సినిమా లవ్ స్టోరీ కాకుండా, యాక్షన్ సినిమా అయితే బాగుంటుందని మహేష్ చెప్పినట్లు వివరించారు. దీంతో తాను మహేష్ కోసం యాక్షన్ డ్రామా కథను సిద్దం చేస్తున్నట్లు గౌతమ్ మీనన్ చెప్పుకొచ్చాడు. అన్ని కుదిరితే వీరి మధ్య సినిమా ఎప్పుడైనా రావచ్చని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు