Ghost: ఓటిటి రిలీజ్ డేట్ ఇదే

కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ది ‘గోస్ట్’. స్పై నేపథ్యంలో గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి బరిలో నాగచైతన్యతో కలిసి ‘బంగార్రాజు’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ్, ఇప్పుడు ‘ది ఘోస్ట్’ సినిమాతో వచ్చి డివైడ్ టాక్ సొంతం చేసుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ లు పెద్దగా ఎవరికి పట్టలేదు. నాగార్జున తన స్వాగ్ తో వన్ మ్యాన్ షో చేశారని అభిమానులు మురిసిపోయారు కానీ ఫలితం లేకుండా పోయింది. ఓవరాల్ గా గోస్ట్ మూవీకి ఫ్లాప్ అనిపించుకుంది.

అయితే నాగార్జున నటించిన ఘోస్ట్ మూవీ త్వరలో ఓటీటీలోకి వచ్చేయనుంది. ఓటిటి వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. అందుకు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. థియేటర్స్ లో ఫ్లాప్ టాక్ రావడంతో చూడని అభిమానులు ఇక్కడ చూసి హిట్ చేస్తారని భావిస్తున్నారు. గతంలో నాగార్జున చిత్రం వైల్డ్ డాగ్, ఓటీటిలో అలాగే వర్కౌట్ అయ్యింది. ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్తూ, నవంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. భారీ ధరను ఇచ్చి తెలుగు సహా హిందీ హక్కులు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు