God Father: క్రెడిట్ మొత్తం అతడికే

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎంతో భారీ ఎత్తున తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” గాడ్ ఫాదర్”. ఈ చిత్రంలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్, పూరి జగన్నాథ్ ముఖ్యపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. దసరా రోజు విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి బాస్ ఇస్ బ్యాక్ అనేలా చేసింది. చిరంజీవి సినిమా అంటేనే డాన్సులు, ఫైట్లు గుర్తొస్తాయి. ఈ చిత్రంలో ఫైట్లు ఉన్నా డాన్సులు మాత్రం లేవు. అయితే విషయం ఏమిటంటే ఈ మూవీలో సత్యదేవ్ కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఒక హీరో ఎలివేట్ అవ్వాలంటే విలన్ చాలా పవర్ఫుల్ గా ఉండాలి.
ఈ సినిమాలో సత్యదేవ్ విలన్ గా అదరగొట్టేశాడు.

చిరంజీవితో ఫేస్ టు ఫేస్ సీన్స్ లో దుమ్ము దులిపేశాడు. ఈ సినిమా విడుదలకి ముందు సత్యదేవ్ ని ప్రతి ప్రమోషన్ లోను చిరంజీవి పొగిడేశారు. సత్యదేవ్ లాంటి నటుడు తన అభిమాని కావడం తనకు గర్వకారణం అని అన్నారు. అయితే సినిమాలో సత్యదేవ్ నటన చూసిన తర్వాత చిరంజీవి తక్కువ పొగిడారేమో అనిపిస్తుంది. చిరంజీవి లాంటి స్టార్ హీరోని ఎదురుగా పెట్టుకుని ఆ రేంజ్ లో నెగిటివ్ రోల్ చేయడం సాధారణ విషయం కాదు. ” లూసిఫర్” సినిమాలో వివేక్ ఓబెరాయ్ కంటే కూడా బాగా చేశాడు. అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ క్రెడిట్ మొత్తం సత్యదేవ్ కే దక్కిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు