God Father:మరో మాస్ సాంగ్

మెగాస్టార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “గాడ్ ఫాదర్”. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ కు ఇది తెలుగు రీమేక్ గా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రమోషన్స్ గ్రాండ్ గా ప్రారంభించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించారు.

ఈ సినిమాను మలయాళం తప్ప మిగిలిన కన్నడ, తమిళ్, హిందీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ తెలుగు, హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార కీలకపాత్రలో నటిస్తోంది. అలాగే సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాథ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇటీవల రిలీజ్ అయిన మొదటి సింగిల్ తార్ మార్ తక్కర్ మార్ అంటూ సాగే పాట మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లింది. ఇక ఇవాళ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ” నజభజ ” అంటూ సాగే ఈ సాంగ్ ను కాసేపటికి క్రితమే చిత్రబంధం రిలీజ్ చేసింది. ఇక ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి చాలా పవర్ఫుల్ గా కనిపించారు. అలాగే ఈ సాంగ్ లో పూర్తిగా… మాఫియా గురించి చూపించారు. ఈ సినిమాలో చిరంజీవి ఎలాంటి క్యారెక్టర్ లో ఉంటారనేది.. ఈ పాటను చూస్తే మనకు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కు థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. బాగా కలిసి వచ్చింది. తాజాగా వచ్చిన ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు