Chiranjeevi : టార్గెట్ త‌మిళ్ ఆడియ‌న్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ లో దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రం “గాడ్ ఫాదర్”. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 5 వ తేదీన దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన ‘లూసిఫర్’ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్ కావడం దానికి తోడు సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ‘లూసిఫర్’ సినిమా తెలుగు వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇదే కథకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెరకెక్కించారు. మంచి బజ్ నడుమ విడుద‌లైన ఈ చిత్రం అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో నయనతార ఒక ఎమోషనల్ పాత్రలో నటించగా పూరి జగన్నాథ్, సత్యదేవ్, సునీల్ తదితరులు కూడా నటించారు. పూరి జగన్నాథ్ చేసింది చిన్న పాత్రే అయినా ఈయనలో కూడా ఇంత మంచి నటుడు ఉన్నాడా అని అనిపించుకునేలా చేశారు.

ఇక సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సత్యదేవ్ నటన అద్భుతంగా ఉంది. సెకండ్లలోనే వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులందరికీ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా వారు తమదైన శైలిలో నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ చిత్రాన్ని కేవ‌లం తెలుగులోనే విడుద‌ల చేయాల‌నుకున్నారు. ఆ త‌రువాత తెలుగు, హిందీల‌లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ మెల్లగా పాన్ ఇండియా సినిమాగా మారింది. త‌మిళ వెర్షన్ ని కూడా సిద్ధం చేసిన మేకర్స్ ఇప్పుడు తమిళంలో రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని తమిళ్ వెర్షన్ లో డబ్ చేసి అక్టోబర్ 16న విడుదల చేయ‌నున్న‌ట్టు ప్రకటించారు. మరిప్పుడు తమిళ వెర్షన్ లో ‘గాడ్ ఫాదర్’ కి ఎలాంటి ఆదరణ వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు