Godfather : మాస్ సాంగ్ నేడే

ఆచార్య తర్వాత మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నుండి వస్తున్న సినిమాల్లో గాడ్ ఫాదర్ ఒకటి. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతుంది. కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్లపై రామ్ చరణ్, ఆర్బీ చౌదరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019లో మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన లూసిఫర్ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా వచ్చే నెల 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. దీని కోసం ప్రమోషన్ పనులను కూడా ప్రారంభించారు. అందులో భాగంగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన ఒక మాస్ సాంగ్ ను విడుదల చేయడానికి మూవీ యూనిట్ సిద్ధమవుతుంది.

తార్ మార్ తక్కర్ మార్ అంటూ సాగే మాస్ సాంగ్ ప్రోమోను ఇప్పటికే విడుదల చేశారు. ఈ సాంగ్ ఈ నెల 15నే విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ రోజు విడుదల చేస్తున్నట్లు యూనిట్ అధికారిక ప్రకటన చేశారు. కాగా చిరు, సల్మాన్ కలిసి చేసి ఈ మాస్ సాంగ్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు