GodFather : అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కి చాలా రోజుల తర్వాత గుడ్ న్యూస్ అందింది. ఆచార్య డిజాస్టర్ తర్వాత చిరు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు హిట్ సినిమా వస్తుందా అని ఎదురుచూశారు. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ ఫాదర్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి మాస్ లుక్స్ కానీ, హీరోయిజం కానీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

కాగా మెగాస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్లి అంతటి సినిమా రాలేదు. భారీ స్థాయిలో వచ్చిన సైరా నరసింహ పెద్ద సక్సెస్ కాలేకపోయింది. ఇక ఆచార్య గురించి అందరికీ తెలుసు. వీటి తర్వాత చిరంజీవికి తప్పక హిట్ రావాల్సిన సమయం. అప్పుడు మోహన్ రాజా.. లూసిఫర్ ను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా తెరకెక్కించాడు. చిరంజీవికి మాస్ ఎలివేషన్స్ ఇస్తూ.. మెగా ఫ్యాన్స్ తో ఈలలు వేయించాడు.

సరిగ్గా 1997 సమయంలో చిరంజీవి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. వరుస ప్లాప్ లతో ఉన్న సమయంలో హిట్లర్ వచ్చింది. ఈ హిట్లర్ ను చేయాలని మోహన్ రాజా తండ్రి ఎడిటర్ మోహన్ సూచించారట. అంతే కాదు.. హిట్లర్ సినిమా ఎడిటర్ మోహన్ సమర్పణలోనే వచ్చింది.

- Advertisement -

అలాగే ఇప్పుడు చిరుకు సరైన హిట్స్ లేని సమయంలో లూసిఫర్ ను అద్భుతంగా రీమేక్ చేసి చిరుకు మోహన్ రాజా మంచి హిట్ అందించాడు. దీంతో అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు మెగాస్టార్ భారీ విజయాన్ని అందించారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో నెట్టింట్లో మోహన్ రాజాతో పాటు ఆయన తండ్రి ఎడిటర్ మోహన్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు