Chiranjeevi : ఆద‌ర‌ణ పెరిగింది

మెగాస్టార్ చిరంజీవి తాజాగా న‌టించిన గాడ్ ఫాద‌ర్ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన ఈ చిత్రానికి సూప‌ర్ హిట్ టాక్ వ‌స్తుండ‌డంతో చాలా కాలం తరువాత చిరు భారీ విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నారు. మ‌ల‌యాళంలో హిట్ చిత్రం లూసిఫ‌ర్ రీమెక్‌గా వ‌చ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యేవిధంగా మార్పులు చేర్పులు చేశాడు డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా.

ఈ సినిమాలో న‌య‌న‌తార‌, స‌త్య‌దేవ్‌, స‌ల్మాన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. విడుద‌లైన‌ప్ప‌టి నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకోవ‌డంతో ఈ సినిమా విడుద‌లైన మూడు రోజుల్లోనే రూ.100కోట్ల‌కు చేరువ‌లో ఉండ‌డం విశేషం. ప్ర‌స్తుతం వీకెండ్ కావ‌డంతో ఈ సినిమాకు ఫుల్ క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. ఈ చిత్రాన్ని కేవ‌లం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా విడుద‌ల చేశారు. హిందీలో సైతం గాడ్‌ఫాద‌ర్ జోరు కొన‌సాగుతోంది.

ఈ చిత్రం హిందీ వెర్ష‌న్‌కు శ‌నివారం నుంచి మ‌రో 600 స్క్రీన్లు పెంచిన‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెష‌ల్ వీడియో కూడా విడుద‌ల చేశారు. అందులో ముఖ్యంగా గాడ్‌ఫాద‌ర్ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ధ‌న్య‌వాదాలు అని, విడుద‌లైన రెండు రోజుల్లోనే మీ సినిమా రూ.69కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టినందుకు చాలా సంతోషం అని చెప్పారు చిరంజీవి. ఈ చిత్రానికి థ‌మ‌న్ మ్యూజిక్‌, చిరు, స‌ల్మాన్‌ఖాన్‌, స‌త్య‌దేవ్ న‌ట‌న అద్భుతం అనే చెప్ప‌వ‌చ్చు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు