Veda: గోపీచంద్ కొత్త చిత్రం.. ఆ కన్నడ స్టార్ డైరెక్టర్ తో?

మ్యాచో స్టార్ గోపీచంద్  ప్రస్తుతం చాలా నిరాశలో ఉన్నారు. 2021 లో సీటిమార్ తో యావరేజ్ హిట్ అందుకున్న గోపీచంద్ ఆ తర్వాత హ్యాట్రిక్ డిజాస్టర్లనందుకున్నాడు. విలక్షణ నటుడిగా మంచి పేరు, ఫ్యాన్స్ బేస్ ఉన్న గోపిచంద్ ఇప్పుడు ఒక్క హిట్టు కోసం ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈ మధ్యనే నటించిన “రామబాణం” కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవడంతో గోపిచంద్ ఎలాగైనా నిఖార్సైన హిట్టు కొట్టాలని కసిమీదున్నాడు.

అందుకే ఈ సారి ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో వస్తున్నాడు. అది కూడా కన్నడ స్టార్ డైరెక్టర్ తో చేస్తున్నాడని తాజాగా ప్రొడ్యూసర్ కే. రాధామోహన్ ప్రకటించాడు. అతని పేరు “హర్ష”. తెలుగువారికి పెద్దగా పరిచయం లేకపోయినా కన్నడలో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందాడు. వజ్రకాయ, అంజనీపుత్ర, భజరంగి, సీతారామ కళ్యాణ వంటి పలు సూపర్ హిట్ సినిమాలు చేసాడు. రీసెంట్ గా శివరాజ్ కుమార్ తో “వేద” సినిమాతో ముందుకు వచ్చాడు. ఆ సినిమా డీసెంట్ హిట్ అయింది.

ఇప్పుడు గోపీచంద్ హర్ష కాంబినేషన్ లో సినిమా రానున్నట్టు చిత్ర నిర్మాత రాధామోహన్ తెలిపారు. ఈ సినిమా గోపీచంద్ కు 31వ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాకి కన్నడ సెన్సేష్నల్ మ్యూజిక్ డైరెక్టర్ “రవి బసూర్” సంగీతం సమకూర్చనున్నాడు. ‘శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్’ లో తెరకెక్కబోయే ఈ సినిమాకి సంబంధించి అధికారిక అప్ డేట్ జూన్ 12న రాబోతుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు. జూన్ 12న గోపీచంద్ బర్త్ డే కావడంతో ఆ రోజున సినిమాకి సంబంధించిన అప్ డేట్ ని చెప్పనున్నారు. ఇక ఈ సినిమాతో నైనా గోపీచంద్ తన ప్లాపుల పరంపరకు అడ్డుకట్ట వేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న కోరికతో ఉన్నాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు