Raveena Tandon : గర్భిణీ గా ఉన్నప్పుడు లావయ్యాను : రవీనా టాండన్

రవీనా టాండన్.. బాలకృష్ణ హీరోగా వచ్చిన బంగారు బుల్లోడు చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ ఆమె ఇక్కడ పెద్దగా రాణించలేకపోయింది. బాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంటూ వచ్చింది. ఇటీవల విడుదలైన కే.జి.ఎఫ్ చాప్టర్ 2 చిత్రంలో ప్రధాన మంత్రి పాత్రలో నటించింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో.. ఆమె పాత్రకి ఎంత మంచి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పవసరంలేదు.ఈ చిత్రం ఆమెకి బాగా కలిసొచ్చింది అనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ బడా దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లో నటింపజేయాలని తాపత్రయ పడుతున్నారు.

ఇదిలా ఉండగా … ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని షాకింగ్ నిజాలు చెప్పుకొచ్చింది. ఈమె గర్భం దాల్చినప్పుడు.. ఈమెను విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారట. ఆ టైంలో లావు అవ్వడం అనేది నేను చేసిన తప్పా అంటూ వాపోయింది. డెలివరీ అయ్యాక ఈమె టీవీ షోలు చేయడానికి రెడీ అయితే.. లావు గా ఉండడం వల్ల ఇలా కదలకుండా టీవీ షోలు చేసుకోవడానికి రెడీ అయ్యారా అంటూ ఓ జర్నలిస్టు అందరి ముందు అడిగాడట. అందుకు ఆమె నేను సన్నబడి చూపిస్తాను అప్పుడు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని ఘాటుగా సమాధానం ఇచ్చిందట

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు