Gowtam Tinnanuri: ఐ వాంట్ అనిరుధ్

అనిరుధ్ రవిచంద్రన్ అతి చిన్న ఏజ్ లోనే “కొలవరి డీ” పాటతో యావత్ సినీ ప్రపంచాన్ని ఉర్రుతలూగించాడు. ఆ తరువాత చాలామంది స్టార్ హీరోస్ సినిమాలకు మ్యూజిక్ చేసి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ధనుష్, అజిత్, విజయ్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ తో పాటు, భీభత్సమైన ఎలివేషన్ ఇచ్చే బిజిమ్స్ ను కూడా అందించాడు.

త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ చేసిన అజ్ఞాతవాసి సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్. వాస్తవానికి అజ్ఞాతవాసి సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు అనిరుధ్. కానీ సినిమాలో అంతలా ఆకట్టుకునే విషయం లేకపోవడంతో అనిరుధ్ బాక్గ్రౌండ్ స్కోర్ అంతగా రిజిస్టర్ కాలేదు. ఆ తరువాత గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ సినిమాతో మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్.

జెర్సీ సినిమా మంచి హిట్ అయింది. అనిరుధ్ అందించిన సంగీతం, అలానే బాక్గ్రౌండ్ స్కోర్ ఈ సివినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. ఈ సినిమా హిట్ టాక్ రాగానే “నా పని అయిపోయింది అనుకున్నార్రా” అంటూ అనిరుద్ పేట సినిమాలోని రజినీకాంత్ డైలాగ్ షేర్ చేయడం కూడా అప్పట్లో హాట్ టాపిక్.

- Advertisement -

ఇప్పుడు గౌతమ్ విజయ్ దేవరకొండ తో సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ అడుగుతున్నాడంట గౌతమ్. అనిరుధ్ కి బదులు జీవి ప్రకాష్ ను తీసుకోమని నిర్మాతలు సూచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది . ఇటీవలే ఈ బ్యానర్ లో వచ్చిన సార్ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చాడు జీవి అందుకే జీవిని సజ్జెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.దానికి తోడు అనిరుధ్ కూడా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాకు ఎవరి మాట నెగ్గుతుందో తెలియాలి అంటే కొన్నిరోజులు వేచి చూడాక తప్పదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు