Hansika: శింబుతో ఆ బంధం ముగిసింది.

హీరోయిన్ హన్సిక మోత్వాని పేరు కొన్ని రోజుల నుంచి తెగ వినిపిస్తోంది. ఇటీవల ఈమె తన బిజినెస్ పార్టనర్ సోహెల్ ఖతూరియాను వివాహం చేసుకుంది. జైపూర్ లోని ముండోట కోటలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లితో పాటు సోషెల్ తో పరిచయం, ప్రేమను లవ్ షాది డ్రామా అనే పేరుతో డీస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఒక డాక్యూమెంటరీ గా వస్తుంది. పెళ్లి నుంచి ఏదో ఒక విషయంతో వార్తల్లో కనిస్తోంది. ఇటీవల కెరీర్ ప్రారంభంలో యువతిగా కనిపించడానికి హన్సిక హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుందని న్యూస్ వచ్చింది.

దీనిపై హన్సిక తో పాటు ఆమె తల్లి కూడా స్పందించారు. ఇలా హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి అంటే తాము బిలినీయర్లు అయి ఉండాలి అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు. ఇది ఇలా ఉండగా, ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోలీవుడ్ హీరో శింబుతో జరిపిన ప్రేమ వ్యవహారంపై స్పందించింది. గతంలో హన్సిక, శింబు ప్రేమలో ఉన్నారంటూ తెగ వార్తలు వచ్చేవి. వీళ్లు కూడా చాలా క్లోజ్ గా ఉండేవారు. అయితే కొన్నాళ్లకు వీరు విడిపోయారు. ఈ ఇంటర్య్వూలో ఈ బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది.

” దీని తర్వాత మరొకరి ప్రేమను అంగీకరించడనాకి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. కోలుకొని కొత్త వ్యక్తి ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి ఎనిమిది సంవత్సరాల పట్టింది. నాకు ప్రేమ పై నమ్మకం ఉంది. కానీ నేను రొమాంటిక్ వ్యక్తిని కానీ రొమాంటిక్ పర్సన్ అని, మనసులోని భావాలను అంత త్వరగా బయట పెట్టలేను. నేను వివాహ వ్యవస్థను నమ్ముతాను. ప్రేమను విశ్వసిస్తాను. అయినా, నా భవిష్యత్తులో నాతో ఉండబోయే వ్యక్తి గురించా చాలా ఆలోచించా.. అందుకు చాలా సమయం పట్టింది. నేను సోహెల్ ప్రేమను ఎక్కువగా నమ్ముతాను. సోహెల్ కూడా నా ప్రేమ కోసం ఎదురు చూశాడు. ఇద్దరం కలిశాం.. మాకు దేవుడు కొత్త దారి చూపించారు. ఆ బంధం ముగిసిపోయింది ఇప్పుడు సోహెల్ తో కొత్త బంధం ప్రారంభమైంది” అంటూ శింబుతో బ్రేకప్ గురించి హన్సిక చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు