Salar : కలెక్షన్స్ ల సునామి ప్రశాంత్ నీల్

ప్రస్తుతం ఇండియా మొత్తంలో ఉన్న సినీ అభిమానులకు ప్రశాంత్ నీల్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. కేజిఎఫ్ సినిమాతో ఈ యువ దర్శకుడు సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు.బాహుబలి సినిమాతో రాజమౌళి ప్రపంచానికి తెలుగు సినిమాని పరిచయం చేస్తే, ప్రశాంత్ నీల్ కన్నడ సినిమాని పరిచయం చేసాడని చెప్పవచ్చు.

కన్నడ ఫిలిం ఇండస్ట్రీ, మిగితా సినీ పరిశ్రమలతో పోలిస్తే చిన్న ఇండస్ట్రీగా చెప్పవచ్చు. అసలు ఇలాంటి ఒక ఇండస్ట్రీ ఉందని కూడా చాలా మందికి తెలియదనడంలో ఆశ్చర్యం లేదు. పరిమితమైన బడ్జెట్, అంతే పరిమితమైన వసూళ్లతో చిన్న, చిన్న సినిమాలు తీస్తున్న కన్నడ ఇండస్ట్రీ నుంచి హోంబలె అనే ఒక నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ఒక యంగ్ డైరెక్టర్ ని నమ్మి ఒక సినిమా తీస్తున్నారనే న్యూస్ అప్పట్లో వైరల్ అయింది. అయితే భారీ బడ్జెట్ సినిమాలు తీయడం వీళ్ళకి కొత్త అవడంతో మొదట్లో బడ్జెట్ కొంతవరకు వేస్ట్ కూడా అయింది, కానీ సినిమాగా క్వాలిటీ గా తీయాలని, అన్ని ఒడిదుడుకులను అధిగమించి ఆ సినిమాని కంప్లిట్ చేసి, ఇండియా వైడ్ గా రిలీజ్ చేసారు. ఆ సినిమానే కేజిఎఫ్. ఆ సినిమా దర్శకుడే ప్రశాంత్ నీల్.

యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని మొదటగా రాజామౌళి కి చూపించగా ఆయన కి సినిమా నచ్చి వెంటనే సినిమా అందరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో తెలుగులో వారాహి బ్యానర్ నుంచి సినిమా రిలీజ్ చేయడానికి అవసరమయ్యే ఏర్పాట్లు చేసాడు. రాజమౌళి సినిమాని ప్రమోట్ చేయడంతో అన్ని భాషల నుంచి కేజిఎఫ్ సినిమాని కొనడానికి బయ్యర్స్ ముందుకి వచ్చారు. ఆ తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్ లకు జనాలు క్యూ కట్టారు. రోజు రోజుకి టాక్ మారుతూ సినిమాకి మంచి ప్రజాదరణ లభించింది. 80 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 250 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

- Advertisement -

ఇక ఆ తరువాత రిలీజైన కేజిఎఫ్ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఏకంగా 1200 కోట్ల వసూళ్ళని రాబట్టింది. కేజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా ప్రపంచమంత కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ . మరి ఇంత పెద్ద సూపర్ హిట్ తీసిన దర్శకుడికి ఎంత అనుభవం ఉందొ అనుకుంటే అది పొరపాటే కేజిఎఫ్ కి ముందు ప్రశాంత్ నీల్ తీసింది కేవలం ఒక్క సినిమానే. కానీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా కేజిఎఫ్ సినిమాని మలిచి అందరిచేత ఔరా అనిపించాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్బంగా, శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఇంత మంచి మంచి సినిమాలు తీసి జనాల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు