Harish Shankar: ‘షాక్’ కమ్‌బ్యాక్..

సినిమా అంటే కొందరికి వ్యాపారం, ఇంకొందరికి వ్యాపకం, కానీ కొంతమందికి జీవితం. ఎంత చదువుకున్న ఇండస్ట్రీలో ఏదో సాధించాలి
అనే కసి తపనతో కొంతమంది ఉంటారు. అందులో హరీష్ శంకర్ ఒకడు రచయిత గా కెరియర్ మొదలు పెట్టి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన హరీష్ శంకర్ నేడు టాప్ డైరెక్టర్స్ లో ఒకడు. ఎన్నో సంవత్సరాల నీరీక్షణ తరువాత దర్శకుడుగా హరీష్ కి అవకాశం వచ్చింది.

దర్శకుడుగా మొదటి సినిమా “షాక్” ఇచ్చింది. రెండో సినిమాకి ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ స్క్రిప్ట్ లో ఇన్వాల్మెంట్ ఎక్కువ. అప్పటికీ ఆయన ఇచ్చిన ఇన్ పుట్స్ చాలా వరకు తీసుకున్నాడు. ఈయన ఏదైనా చెబుతుంటే ప్రొడ్యూసర్ ఇదివరకే తీసిన బ్లాక్ బస్టర్ సినిమాలు గురించి చెబుతున్నాడు. ఆ ఆర్గ్యుమెంట్స్ కాస్తా గొడవకు దారితీసాయి. రేపు పదివేలు రూమ్ రెంట్ కట్టాలి చేతిలో రూపాయి లేదు. ఎదురుగా పది లక్షలు రూపాయిల చెక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్న ప్రొడ్యూసర్.

ఈగో కి సెల్ఫ్ రెస్పెక్ట్ కి తేడాను గ్రహించి సినిమాని వదిలేసాడు. అది పొగరు అని కొందరంటారు. కాదు గట్ ఫీలింగ్ అని హరీష్ శంకర్ నమ్మాడు. అది హరీష్ శంకర్ అంటే. దర్శకుడిగా ఫెయిల్ అయిన తరువాత మళ్ళీ హరీష్ శంకర్ రైటర్ గా పూరి జగన్నాధ్ దగ్గర వర్క్ చేసాడు. ఎట్టకేలకు రవితేజ ఇచ్చిన మరో అవకాశంతో మిరపకాయ్ తో మంచి హిట్ కొట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు హరీష్ శంకర్.

- Advertisement -

ఆ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాను చేసి, ఇండస్ట్రీను షేక్ చేసాడు. ఆకలితో వచ్చిన ప్రేక్షకుడిని భుక్తాయాసంతో థియేటర్ నుండి బయటకు పంపాడు. సినిమా ద్వారా ఎడ్యూకేట్ చెయ్యాలి. లేదంటే ఎంటర్‌టైన్ చెయ్యాలి. ఎడ్యూకేట్ చేయలేను కాబట్టి ఎంటర్‌టైన్ చేస్తా అని క్లారిటీ ఉన్న దర్శకుడు హరీష్ శంకర్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆశిస్తూ.. అక్షరానికి అమ్మ అంత గౌరవాన్ని ఇచ్చే హరీష్ శంకర్ కి పుట్టిన రోజు శుభాంక్షలు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు