Hari Hara Veera Mallu : టీజర్ అప్పుడేనా ?

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో ప్రేక్షకులకి పరిచయం అయ్యారు పవన్ కళ్యాణ్ .తన మొదటి సినిమాతోనే నటన తో ప్రేక్షకులని ఆకట్టుకొని పవర్ స్టార్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల తో బిజీ గా ఉన్నారు. ఇటీవలకాలంలో వరుస సినిమాలను అనౌన్స్ చేసారు పవర్ స్టార్.

పవన్ కళ్యాణ్ సుజిత్ తో ఒక సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాను చేయనున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో ‘హరి హర వీర మల్లు’ అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

పవన్ కళ్యాణ్ తన ఆటిట్యూడ్ తో తన ఫ్యాషన్ తో ప్రేక్షకులని కట్టి పడేసిన సినిమా ఖుషి .ఒక రీమేక్ ఫిలిం అయినప్పటికీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఘనత ఈ సినిమా కి ఉంది. ఈ సినిమాకి మణిశర్మ అందించిన సంగీతం ఎంతో మందికి అల్ టైం ఫేవరెట్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయి 21 ఏళ్ళు గడిచినా , ఈ సినిమా కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

- Advertisement -

అయితే ఈ సినిమా డిసెంబర్ 31న రీ రిలీజ్ అవుతోంది . ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ సినిమా అయినా ‘హరి హర వీర మల్లు’ టీజర్ ని కూడా తెర మీదకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి అని వార్తలు వినపడుతున్నాయి. ఇది ఎంత వరకు వాస్తవమో తెలియాలి అంటే ఖుషి మూవీ రీ రిలీజ్ అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు