Hari Hara Veera Mallu : రంగం సిద్ధం

విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన తెలుగు సినిమాకి అందించారు. ఆయన ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ కథానాయకుడిగా ‘హరిహర వీర మల్లు’ అనే చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

సాధారణ చిత్రాలతోనే ఏ హీరోకి సాధ్యంకాని విధంగా అభిమానులను సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. మొదటిసారి ఆయన ఇలాంటి భారీ స్థాయి పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. తన అభిమానులతో పాటు తెలుగు, భారతీయ సినీ ప్రేమికుల హృదయాలలో నిలిచిపోయే చిత్రాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు.

చిత్రీకరణ నుండి కొంత విరామం తర్వాత రాబోయే షెడ్యూల్‌లో పాల్గొనే ప్రధాన నటీనటులు మరియు కొంతమంది ముఖ్యమైన సాంకేతిక నిపుణలతో ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్‌ నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. శుక్రవారం ఉదయం ఈ చిత్రం వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్ గురించి పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ ముందుగానే చర్చించారు. పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. షూటింగ్ కి వెళ్లే ముందు తాను మరియు తన తోటి నటీనటులు పాత్రల గురించి మరింత అవగాహన పొందేందుకు మరియు స్క్రిప్ట్ గురించి బాగా చర్చించుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వర్క్‌షాప్‌కు వెంటనే అంగీకరించారు.

- Advertisement -

ఈ ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, హాస్యనటుడు హైపర్ ఆది తో పాటు చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం, నిర్మాత ఎ దయాకర్ రావు, సంగీత దర్శకులు కీరవాణి పాల్గొన్నారు. వర్క్‌షాప్ ముగిశాక అక్టోబర్ రెండో వారం తర్వాత నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు