Hari Hara Veera Mallu: వెండితెరపై అద్భుతాన్ని సృష్టిస్తాం

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు ఉన్న క్రేజ్ వర్ణానితీతం వరుస హిట్ సినిమాలు చేసి అంచలంచెలుగా ఎదుగుతున్న తరుణంలో పవన్ దర్శకుడిగా జానీ సినిమాను చేసారు. ఆ సినిమా అప్పుడు కమర్షియల్ గా హిట్ కాలేదు.
కానీ దర్శకుడిగా పవన్ కళ్యాణ్ కి మంచి మర్క్స్ పడ్డాయి. ఇప్పటికి జానీ సినిమాను చూస్తుంటే ఆ సినిమాను కళ్యాణ్ టెక్నీకల్ గా బాగా తెరకెక్కించాడు అని అర్ధమవుతుంది.

జానీ సినిమా తరువాత వరుస సినిమాలు ఫెయిల్ అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతూ వచ్చింది. అలానే రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ వలన సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రీ ఎంట్రీ తో మంచి హిట్ అందుకుని వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ జాగర్లమూడి “హరిహర వీరమల్లు” అనే పీరియాడిక్ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.

- Advertisement -

చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము.

వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం.

అంటూ హరి హర వీర మల్లు చిత్ర బృందం తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు