Harish Shankar : DJ సినిమా కోసం బన్నీ అంత త్యాగం చేశాడా..!

హరీష్ శంకర్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం దువ్వాడ జగన్నాథం. 2017 జూన్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ చిత్రంలో విజయవాడలో నివసించే ఓ బ్రాహ్మణుడి పాత్రలో నటించి మెప్పించారు అల్లు అర్జున్. ఈ సినిమా విడుదల సమయంలో వీకెండ్స్ తో పాటు రంజాన్ సెలవులు కలిసి రావడంతో ఐదు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా డీజే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 78 కోట్ల షేర్ రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలనుతెచ్చిందని టాక్. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ చికెన్ తినడం మానేశారట. అందుకు గల కారణం ఏంటంటే..

ఈ మూవీలో అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణుడి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణులు చికెన్ తినరు గనుక వారికి గౌరవాన్ని ఇస్తూ బన్నీ కూడా ఆ పాత్రలో నటిస్తున్నంతకాలం చికెన్ కి దూరంగా ఉన్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ వెల్లడించారు. దీంతో హరీష్ శంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు ఆయనకు ఉన్న అంకితభావం అలాంటిది అని, దీన్ని బట్టి చూస్తే బన్నీకి సినిమాలంటే ఎంత ఇష్టమో అర్థమవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు