Harish Shankar: మిడిల్ క్లాస్ లైఫ్ ను చదివాడు

పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్ కెవి.
జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను అందుకున్నాడు.
వాస్తవానికి జాతి రత్నాలు సినిమా రిలీజ్ కు ముందుగానే బాగా పాపులర్ అయ్యాడు అనుదీప్. ఈ టీవీ లో వచ్చిన క్యాష్ షోతో తనలో ఉన్న ఇనోసెన్స్ బయటకు తీసి అందరిని ఎంటర్టైన్ చేసాడు. ఆ తరువాత జాతి రత్నాలు సినిమా ప్రొమోషన్స్ లో అనుదీప్ పెద్ద హైలెట్ అయ్యాడు.

అనుదీప్ హాజరైన ప్రతి ఇంటర్వ్యూ లో ఏమి చదవావ్ అనే ప్రశ్నకు రకరకాల సమాధానాలు బయటకు వస్తాయి. ఇప్పటికి అనుదీప్ కెవి ఏమి చదవుకున్నాడు అనేది గండికోట రహస్యమే. అనుదీప్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “ప్రిన్స్” ఈ చిత్రంలో శివకార్తికేయన్, మరియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 21 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ తరుణంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. విజయ్ దేవరకొండ, హరీష్ శంకర్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ “అనుదీప్ ఏమి చదువుకున్నారో నాకు తెలియదు. కానీ జాతి రత్నాలు సినిమా చూసిన తరవాత ఒక మధ్యతరగతి జీవితాన్ని చదివాడు అని అర్థమైంది. అతను ఎందుకు సీరియస్ గా ఉంటాడు అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాపు గారు , జంధ్యాల గారు వీళ్ళందరూ కూడా ఒక మిడిల్ క్లాస్ మనస్తత్వాన్ని అర్ధం చేసుకుని కామెడీ పండించారు. సో జంధ్యాల గారు చెప్పినట్టు కామెడీ చాలా సీరియస్ గా చెయ్యాలి, లేకపోతే వెకిలిగా అయిపోతుంది అందుకే అనుదీప్ అంత సీరియస్ గా ఉంటారు” అని చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు