Harish Shankar: “ఉస్తాద్ భగత్ సింగ్” గా పవన్ కళ్యాణ్

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించి చాలా కాలమైంది. అయితే కొన్నాళ్లకు ఆ సినిమా స్క్రిప్ట్ పై నమ్మకంగా లేకపోవడంతో పవన్ కళ్యాణ్ వెనుకడుగు వేశారు.

ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరొక స్క్రిప్ట్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అది కూడా తేరి రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి అఫీషియల్ గా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తేరీ రీమేక్ అవసరం లేదంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గొడవే చేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్, హరీష్ మూవీ లపై అందరిలో ఇంట్రెస్ట్ ని పెంచేశాయి.

అయితే ఈ వార్తలన్నీటికి సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్ తో తాను “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించారు హరీష్ శంకర్. దీనికి ” మనల్ని ఎవడ్రా ఆపేది” అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. ఆదివారం ఉదయం దీనికి సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ బైక్ ని ఆనుకొని నిలబడి ఓ చేతితో బైక్, మరో చేతిలో టీ గ్లాస్ పట్టుకొని కనిపించారు. ఈ సినిమాని అనౌన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ పండగ చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు