Hebah Patel : విజువ‌ల్స్ అద్భుతం

గ్లామరస్ బ్యూటీ హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బ్లాక్ & వైట్’. పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎస్‌ఆర్ ఆర్ట్స్/ ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్‌ లిమిటెడ్ సహకారంతో ఎ మేఘనా రెడ్డి సమర్పిస్తున్నారు. ఎల్ఎన్‌వీ సూర్య‌ ప్రకాశ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, లహరి షరి , నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను లెజెండరీ రైటర్, రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు.

ట్రైల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రంలో హెబ్బాప‌టేల్ డిఫ‌రెంట్ షేడ్స్‌లో క‌నిపించారు. ఈ చిత్రం టైటిల్‌కి త‌గిన‌ట్టే టీజ‌ర్ కూడా ఆకట్టుకునేవిధంగా ఉంది. ‘‘నో కమిట్‌మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్’’అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంలోని చాలా పాత్ర‌ల‌ను టీజ‌ర్‌లో అనుమాన‌స్ప‌ద రీతిలో చూపించారు. న‌వీన్, ల‌హ‌రి పాత్ర‌ల‌ను కూడా చూపించారు.

ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ టీజ‌ర్ థ్రిల్ల‌ర్ సినిమా ప్రేమికుల‌ను ఆకట్టుకునేవిధంగా ఉంది. యువ‌త‌కు న‌చ్చే అంశాలు చాలానే ఉన్నాయి. ఈ టీజ‌ర్ క‌ట్‌తో సూర్య ప్ర‌కాశ్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాడు. టీజ‌ర్‌లో విజువ‌ల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. టి. సురేంద‌ర్ రెడ్డి సినిమాటో గ్ర‌ఫీ హైలెట్ అవుతోంది. అజ‌య్ అర‌సాడ సంగీత‌మందించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు మేక‌ర్స్‌.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు