Tarun: గుడ్‌ న్యూస్‌ చెప్పేసిన తరుణ్‌ !

Tarun: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కనుమరుగైపోయారు. ఇక కొంతమంది హీరోలు అప్పుడప్పుడు మెరుస్తున్నారు. అలాంటి వారిలో హీరో తరుణ్‌ ఒకరు. ఒకప్పటి స్టార్ హీరో తరుణ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి హీరో తరుణ్. “నువ్వే కావాలి”, “నువ్వే నువ్వే”, “నువ్వు లేక నేను లేను” వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి యూత్ మనసును ఆకట్టుకొని ప్రతి ఒక్క అమ్మాయి కళల రాకుమారుడిగా మారాడు. అయితే ఆ తర్వాత తరుణ్ చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు.

ఇదిలా ఉంటే…. సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు చాలా సాధారణం. ఈ క్రమంలోనే తరుణ్ హీరోగా నటిస్తున్న సమయంలోనే ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం సాగించాడంటూ రూమర్స్ వచ్చాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆర్తి అగర్వాల్. దివంగత నటి ఆర్తి అగర్వాల్ తో తరుణ్ ప్రేమాయణం నడిపించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంలో వాస్తవాలు ఇప్పటివరకు తెలియరాలేదు. 20 ఏళ్ల పాటు తన స్టార్ డమ్ కొనసాగించిన తరుణ్ అప్పుడప్పుడు కొన్ని వివాదాలు, పరాజయాలతో తన కెరీర్ కు దూరం అయ్యారు. తరుణ్ 2014 సంవత్సరం వరకు ఇండస్ట్రీలో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. చివరగా తరుణ్ “వేట” చిత్రంలో నటించారు. శ్రీకాంత్ తో కలిసి ఓ సినిమా కూడా చేశాడు. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ సాధించలేదు.

అదే సమయంలో “ఇది నా లవ్ స్టోరీ” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా 2018లో విడుదలైంది. కానీ ఆ సినిమా వచ్చిన విషయం కూడా అభిమానులకు పెద్దగా గుర్తులేదు. దాదాపు పదేళ్లపాటు తరుణ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కెరియర్ లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి తరుణ్ అంతే స్థాయిలో వివాదాలకు కూడా కారణమయ్యారు. ఒకప్పుడు హీరోయిన్ల ఆత్మహత్యాయత్నం పెద్ద తలనొప్పులు తెచ్చి పెట్టింది. అంతేకాదు డ్రగ్స్ కేసులో కూడా తరుణ్ చిక్కుకున్నారు. మరొకవైపు వరుస పరాజయాలతో కెరియర్ కి దూరమయ్యారు.

- Advertisement -

అంతేకాదు ఒకానొక సమయంలో తరుణ్ చేసిన పనికి పోలీసులు తన ఇంటికి వచ్చి పెద్ద రచ్చ చేశారు. ఈ నేపథ్యంలోనే తరుణ్ కెరియర్ పై స్పందించింది తరుణ్ అమ్మ సీనియర్ నటి రోజా రమణి. తరుణ్ తల్లి తరుణ్ సినిమాల రీఎంట్రీకి సంబంధించి ఓ గుడ్ న్యూస్ చెప్పింది రోజా రమణి. త్వరలోనే తరుణ్ మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్టు చెప్పి తరుణ్ అభిమానులకు తీపి కబురు అందించింది. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించి ప్లాన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ అభిమానుల ముందుకు రాబోతుందని ఆమె వెల్లడించారు.

తరుణ్ మళ్లీ ఎలాంటి సినిమాతో రావాలి… ఎలాంటి కథలు చేయాలనేది వర్క్ జరుగుతుందని…. కచ్చితంగా తరుణ్ అభిమానులకు సర్ప్రైజింగ్ గా ఉంటుందని రోజా రమణి వెల్లడించారు. ఏది పడితే అది కాకుండా మంచి సినిమాతో అభిమానుల ముందుకు రావాలని వెయిట్ చేస్తున్నట్టు తెలిపారు రోజా రమణి. ఇక ఈ విషయం తెలిసిన తరుణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తరుణ్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇక తరుణ్ ఈ సినిమాతోనైనా మళ్ళీ ఇండస్ట్రీలో రాణించాలని కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు