Hina Khan : రాకీతో బ్రేకప్ నిజం కాదు

బాలీవుడ్ లో లవ్ ఎఫైర్స్.. డేటింగ్, బ్రేకప్ లకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నిజాలు ఉంటాయి…. మరి కొన్ని రూమర్స్ వినిపిస్తుంటాయి. ప్రస్తుత కాలంలో వీటికి సంబంధించిన రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొంత మంది హీరో హీరోయిన్లు డేటింగ్ చేస్తునట్టు వార్తలు వస్తాయి. అలాగే డేటింగ్ లో ఉన్న వారిని విడదీస్తారు కూడా. దీంతో స్వయంగా నటీ నటులు రంగంలోకి దిగి వాటిపై క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది.

తాజాగా అలాంటి పరిస్థితి బాలీవుడ్ నటి హీనా ఖాన్ కు వచ్చింది. ఫిల్మ్ ప్రొడ్యూసర్ రాకీ తో ప్రేమలో ఉన్నారు హీనా ఖాన్. అంతే కాదు చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు తొలి సారి యే రిష్తా క్యా కెహ్లతా హై అనే చిత్ర షూటింగ్ లో కలిశారు. అప్పుడు పరిచయమైన వీరు ప్రేమికులుగా మారారు. అయితే గత కొన్ని రోజుల నుంచి వీరి గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. నిర్మాత రాకీ, హీనా ఖాన్ మధ్య విభేదాలు వచ్చాయని, అందు చేత తమ మధ్య ఉన్న బంధాన్ని తెంచుకున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఈ వార్తలపై తాజాగా హీనా ఖాన్ స్పందించింది. “రాకీతో బ్రేకప్ కు సంబంధించి చాలా వార్తలు విన్నాను. అయితే ఈ బ్రేకప్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం రాకీతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఇలాంటి వార్తలు విని మా ఫ్రెండ్స్ కంగారు పడుతున్నారు. మీరు బాగానే ఉన్నా.. ఎందుకు ఇలాంటి వార్తలు వస్తున్నాయి అంటూ అడుతున్నారు. అలాగే రాకీ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఇలాంటి పుకార్లను పట్టించుకోడు” అంటూ హీనా ఖాన్ చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉండగా హీనా ఖాన్ ప్రస్తుతం శడ్యంత్ర అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు