Hit 2 : అడివి శేష్ సినిమాను తొలిగించిన అమెజాన్

భారీ అంచనాలతో వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రం హిట్ : ది సెకండ్ కేస్. శైలేష్ కోలును సృష్టించిన హిట్ యూనివర్స్ లో వచ్చిన రెండో చిత్రం ఇది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రం డిసెంబర్ లో థియేటర్ లో సందడి చేసింది. అడవి శేష్ కు జంటగా మీనాక్షి చౌదరి నటించిన విషయం తెలిసిందే.

కాగా అడవి శేష్ కెరీర్ లో హిట్ : ది సెకండ్ కేస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన మీనాక్షి చౌదరి ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో కుర్రకారు మనసులను దోచుకుంది ఈ పంజాబీ బ్యూటీ.

అయితే థియేటర్స్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్ ను మిస్ అయిన వారంతా ఈ సినిమా ఎప్పుడెప్పుడు OTTలో వస్తుందా అని వేచి చుస్తునారు. అలాంటి వారికి పెద్ద షాక్ తగిలింది. హిట్ 2 సినిమాను కొని కారణాల వల్ల అమెజాన్ ప్రసారం చేయకుండా ఆపివేసింది. ఏలాంటి ముందస్తు ప్రకటన లేకుండా మూవీ ను తీసేయడం తో ఫాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా జనవరి 6 నుంచి ఈ చిత్రం మల్లి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానున్నట్టు ప్రకిటించారు.

- Advertisement -

కాగా ముందుగా మూవీ యూనిట్ పే పర్ వ్యూ పద్దతిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకువస్తామని చెప్పింది. 6వ తేదీ నుంచి ప్రీగా స్ట్రీమ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. కానీ, తాజాగా జరిగిన పరిణామంతో హిట్ 2 ను ఫ్రీగా ఎప్పటి నుంచి ప్రసారం చేస్తారు అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీ థియేటర్ లో డిసెంబర్ 2న విడుదలైన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు