HIT2 : చిన్న పిల్లలకు కాదు..

భయపెట్టించే సినిమాలు..
ఒళ్లు గగుర్పాటు కలిగించేలా ఉండే రక్తపు సన్నివేశాలు..
తెరపై మనుషుల కంటే.. ఆయుధాలు, రక్తం కనిపించే ఫైట్ సీన్స్..
కాళ్లు, చేతులు, తలలు తెగ నరికే షాట్స్..
ఈ సినిమాలు చిన్న పిల్లలకు కాదు..
గుండె పోటు ఉన్నవాళ్లు అసలు చూడొద్దు..

ఇలాంటివి హాలీవుడ్ సినిమాల్లో విపరీతంగా కనిపిస్తాయి. ప్రస్తుత కాలంలో ఓటీటీల పుణ్యమా అని తెలుగు, సౌత్ ప్రేక్షకులు కూడా ఇలాంటి హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు. అంతే కాదు.. అలా వైలెన్స్ ఉండే మూవీస్ ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దీన్ని క్యాచ్ చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు తెలుగు దర్శక నిర్మాతలు. అలా వస్తున్న సినిమానే హిట్2.

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలన్ హిట్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న హిట్ 2 డిసెంబర్ 2న పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్నీ అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో బజ్ ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా టీజర్ ను యూట్యూబ్ నుంచి తొలగించడంతో.. “అంతలా ఏం ఉంది ఈ సినిమాలో..” అనే సెర్చింగ్ కూడా జరిగింది.

- Advertisement -

అలా టీజర్ తోనే అందరికీ తెలిసిపోయింది.. హిట్2 లో భీకరమైన వైలెన్స్, రక్తపాతం ఉంటుందని. తాజాగా ఈ సినిమా సెన్సార్ ప్రక్రియను కూడా పూర్తి చేసుకుంది. హిట్ 2 సెన్సార్ రిపోర్ట్ ను పరిశీలిస్తే.. ఈ సినిమా కేవలం 2 గంటల నిడివితో ఉందని అర్థమవుతుంది. దీని కంటే ముందు అందరి కంట పడింది.. “A” సర్టిఫికేట్. అంటే హిట్ 2 సినిమా 18 ఏళ్ల పై బడిన వారే చూడాలి. ఈ విషయాన్ని హిట్2 హీరో అడివి శేష్ స్వయంగా వెల్లడించాడు. టీజర్ లో చూపించినట్టు సినిమాలో చాలా వైలెన్స్ సన్నివేశాలు ఉన్నాయని సెన్సార్ రిపోర్ట్ తో స్పష్టమవుతుంది.

నిజానికి మూవీ యూనిట్ కూడా భారీ స్థాయిలో వైలెన్స్ ఉంది అన్నట్టుగానే ప్రమోషన్స్ చేస్తోంది. మరి అతి వైలెన్స్ సినిమాకు ప్లస్ అవుతుందా ? లేదా మైనస్ అవుతుందా ? అని తెలియాలంటే.. డిసెంబర్ 2 వరకు వెయిట్ చేయక తప్పదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు