Hit 2 : మైల్ స్టోన్ కి అతి చేరువలో..

శైలేష్ కొలను సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన రెండో సినిమా హిట్2. అడివి శేష్, మీనాక్షి చౌందరి జంటగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదలైంది. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హిట్2, దాదాపు అన్ని సెంటర్ లలో కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను అందుకుంది. 6 రోజులకు గాను హిట్ 2 ప్రపంచ వ్యాప్తంగా 34.2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే 18.01 కోట్లకు పైగా షేర్ ను వసూళ్లు చేసి దూసుకెళ్తుంది.

ముఖ్యంగా యూఎస్ లో హిట్ 2ను ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. యూఎస్ లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ను ఇప్పటికే అందుకుని బయ్యరకు మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. మొత్తంగా హిట్ 2 కలెక్షన్లు ఓవర్సీస్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అతి త్వరలోనే యూఎస్ లో 1 మిలియన్ మైల్ స్టోన్ అందుకోవడానికి సిద్ధమవుతుంది.

ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు 9 లక్షల డాలర్లను వసూళ్లు చేసింది. 1 మిలియన్ డాలర్ల అందుకోవడానికి మరో ఒక్క అడుగు మాత్రమే ఉంది. అది కూడా రెండు నుంచి మూడు రోజుల్లో టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 1 మిలియన్ మార్క్ ను దాటిన తర్వాత కూడా హిట్ 2 ప్రభంజనం కొనసాగే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు