Hit-2: ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు దర్శకధీరుడు

శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన చిత్రం “హిట్ 2”. నాచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఈ మూవీ వస్తుండగా.. నాని సోదరి ప్రశాంతి తీపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఓ యువతి మర్డర్ కేసు మిస్టరీని ఛేదించడం కోసం రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ కి, ఆ హత్యతో అనేక హత్యలు ముడిపడి ఉన్నాయనే సంగతి తెలుస్తుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా కథ.

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ రెండవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హిట్ 2 మూవీ ప్రీ రిలీజ్ వేడుకలు సోమవారం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో జరగనుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. సోమవారం సాయంత్రం 6:00కి ప్రారంభం కానున్న ఈ వేడుకకి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రాబోతున్నట్లు ఆ పోస్టర్ లో మూవీ యూనిట్ తెలిపింది. హిట్ మూవీకి కూడా చీఫ్ గెస్ట్ గా రాజమౌళి వచ్చాడు. ఆ సినిమా మంచి హిట్ కావడంతో నాని సెంటిమెంట్ గా మళ్లీ హిట్ 2 కి రాజమౌళిని పిలిచినట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు