HIT2 Teaser : ఇంట్రెస్టింగ్ గా సెకండ్ కేసు

“హిట్ యూనివర్స్” ను డైరెక్టర్ శైలేష్ కొలను ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ యూనివర్స్ నుంచి ఇప్పటికే “హిట్ ది ఫస్ట్ కేసు” వచ్చింది. విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు “హిట్ ది సెకండ్ కేసు” అంటూ అడివి శేష్ తో మరో సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ శైలేష్. అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నా.. ప్రేక్షకులు మాత్రం మర్చిపోలేరు. ఈ సినిమా కోసం ఎదురుచూస్తునే ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు.

ఈ టీజర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు. హై ప్రొఫైల్ కేసులు నమోదు కాని ఒక చిన్న పట్టణంలో హీరో పోలీస్ గా వర్క్ చేస్తాడు. అంతా సాఫీగా సాగుతున్న క్రమంలో ఒక మర్డర్ జరుగుతుంది. ఒక యువతిని మర్డర్ చేసి, అత్యంత క్రూరంగా ముక్కలు ముక్కలుగా చేస్తారు. ఆ కేసును చేజ్ చేయడానికి మన హీరో అడివి శేష్ ముందుకు వస్తాడు. ఈ తరుణంలో వచ్చిన సవాళ్లు ఏంటి ? ఈ మర్డర్ ను చేసిన వాడి మోటివ్ ఏంటి ? ఈ కేసును హీరో ఛేదించాడా ? అనేది సినిమాలో ఉండబోతుందని టీజర్ తో అర్థమవుతుంది.

అలాగే 1:34 నిమిషాలు ఉన్న ఈ టీజర్ లో హీరో పోలీస్ అధికారి దేవ్ (KD) పాత్రలో అడివి శేషు, డీజీపీ నాగేశ్వరరావు పాత్రలో రావు రామేష్, ఆర్య పాత్రలో హీరోయిన్ మీనాక్షీ చౌదరి కనిపించారు. టీజర్ లో రావు రామేష్, అడివి శేష్ మధ్య వచ్చే సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. అలాగే టీజర్ చివరలో “యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః.. యత్రేతాస్తున పూజ్యంతే సర్వాస్తత్రాశురా” అంటూ వచ్చిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది.

- Advertisement -

మొత్తంగా ఈ టీజర్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కాగా ఈ సినిమా డిసెంబర్ 2న థియేటర్ లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు