KGF3 : బ్లాక్ బస్టర్ అప్డేట్

కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన కేజిఎఫ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాతో యష్ కు కూడా సూపర్ క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. చాప్టర్ 1 కంటే చాప్టర్ 2 గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా చాలా రికార్డులను బ్రేక్ చేసింది.

దీంతో, యష్ అభిమానులు కేజిఎఫ్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్. తమ నిర్మాణ బ్యానర్ హోంబలే ఫిల్మ్స్ పై రాబోయే సినిమాలపై నిర్మాత విజయ్ కిరంగదూర్ స్పందించారు. అందులో భాగంగా కేజీఎఫ్ 3 గురించి కూడా ఈ స్టార్ ప్రొడ్యూసర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

కేజీఎఫ్ 3ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. దీని కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటికే స్టోరీని కూడా సిద్ధం చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. కేజీఎఫ్ 3ని ప్రభాస్ సలార్ పూర్తి అయిన వెంటనే సెట్స్ పైకి తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. అలాగే ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రం 2024 లో థియేటర్ లోకి రానుందని చెప్పుకొచ్చాడు. అలాగే రాబోవు ఐదేళ్లలో హోంబలే ఫిల్మ్స్ రూ. 3,000 కోట్లు చిత్ర నిర్మాణంలో పెట్టబోతున్నట్లు కూడా స్పష్టం చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు