Honey Rose: నేను పెళ్లికి సిద్ధం

బాలయ్య భామ హనీరోజ్ గురించి తెలియని వారు ఉండరు. ఈ మధ్యకాలంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైంది ఈ బ్యూటీ. నిజానికి చాలా ఏళ్ల క్రింద హనీరోజ్ తెలుగులో సినిమాలు చేసింది. కానీ అప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీర సింహారెడ్డిలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఒకవైపు బాలయ్యతో రొమాన్స్ చేస్తూనే మరో బాలయ్య పాత్రకు అమ్మ పాత్ర చేసింది.

‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి…’ తో పాటు సినిమాలో బాలయ్యకు హానీరోజ్ కి మధ్య వచ్చిన సన్నివేశాలతో హనీరోజ్ సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ లలో తన డ్రెస్ తో మీడియాను అట్రాక్ట్ చేసింది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ బ్యూటీ విజయవాడలోని ఓ బేకరీ ఓపెనింగ్ కు వెళ్ళింది. అక్కడి అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ నేపథ్యంలోనే హనీరోజ్ ను అభిమానులు పెళ్లి గురించి అడిగారు. పెళ్లి ప్రశ్నలపై హనీ స్పందిస్తూ పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను తను సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.

వివాహ బంధం బలంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చింది. వీటితో పాటు నటనపై తనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేదని చెప్పింది. ఇక హానీ 2005 లో “బాయ్ ఫ్రెండ్” అనే మలయాళ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. శివాజీ హీరోగా నటించిన ఆలయం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ కొన్నేళ్ల వరకు తెలుగులో కనిపించలేదు. ఆ తర్వాత ఆరేళ్లకు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన “ఈ వర్షం సాక్షిగా” సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవడంతో మళ్లీ తెలుగులో అవకాశాలు కరువయ్యాయి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు