Anil Sunkara: అయ్యగారిని ఏ ధైర్యంతో నమ్మాడో.. !

కొంత మందికి సినిమాలంటే ఇష్టం. మరి కొంత మందికి పిచ్చి. ఇలా పిచ్చి ఉన్నవాళ్లు సినిమాల కోసం ఏదైనా చేస్తారు. అలాంటి వ్యక్తియే.. అనిల్ సుంకర. ఈ ప్రొడ్యూసర్ కి సినిమాలంటే ఎంత ఇష్టమంటే, అమెరికాలో సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నా.. సినిమాలపై ఉన్న ప్రేమతో అన్ని వదులుకుని డిస్ట్రిబ్యూటర్ గా మారి, ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగాడు. అనిల్ సుంకర.. బిందాస్ అనే మూవీతో నిర్మాతగా మారాడు. ఫస్ట్ సినిమాతోనే లాభాలను తెచ్చుకున్నాడు. 3 కోట్లతో తెరకెక్కిన బిందాస్.. ఆ రోజుల్లోనే 8 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు చేసింది.

బోణి బాగుండటంతో వరుసగా సినిమాలు చేశాడు. అటు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ లో భాగస్వామిగా ఉంటూనే, సొంతంగా AK ఎంటర్‌టైన్‌మెంట్స్ స్టార్ట్ చేశాడు. అనిల్ సుంకర్ ఇప్పటి వరకు 30 సినిమాల వరకు ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఇందులో హిట్ సినిమాలు ఉన్నాయి. ఫ్లాప్స్ ఉన్నాయి. అవేవీ కూడా ఆయనను ఇబ్బంది పెట్టలేదు. కానీ, తాజాగా అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ మూవీ దెబ్బ కాస్త గట్టిగానే పడింది.

నిజానికి అనిల్ సుంకర్ మంచి ప్రొడ్యూసర్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కథ నచ్చితే ఎంతైనా ఖర్చు చేస్తాడని అంటారు. అయితే ఈ ప్రొడ్యూసర్.. ఇప్పటి వరకు ఒక్క హిట్ కొట్టలేని, కనీసం ఇమేజ్ లేని హీరోని ఎలా నమ్మాడో అనేది పెద్ద చర్చ. అయ్యగారిని నమ్మి 80 కోట్ల బడ్జెట్ ఎలా పెట్టాడు ? అని ఓ ప్రశ్న. అఖిల్ కెరీర్ లో కాస్తో కూస్తో హిట్ అని చెప్పుకునే మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా వచ్చిన టోటల్ కలెక్షన్లు కేవలం 51 కోట్లు. అంటే అయ్యాగారికి కనీసం 50 కోట్ల మార్కెట్ కూడా లేదు.

- Advertisement -

అలాంటి హీరోపై 80 కోట్ల బడ్జెట్ ఎందుకు పెట్టాడు ? స్టోరీపై నమ్మకమా అని అనుకుంటే.. అసలు ఆ స్టోరీలో కొత్తగా ఏం లేదు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్పై స్టోరీల్లాగే.. ఏజెంట్ కథ ఉంది. ఈ స్టోరీ రాసినందుకు వక్కంతం వంశీకి ఏకంగా 2 కోట్లు ముట్టజెప్పారంటా..! ఇలా అన్నింటిలోనూ అనిల్ సుంకర తొందర పడ్డాడు అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. ఇంత పెద్ద డిజాస్టార్ వచ్చిన తర్వాత అయినా, అనిల్ సుంకర మారాలని, కథ, హీరో మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించాలని క్రిటిక్స్ సూచిస్తున్నారు. లేకుంటే, నష్టాలు తప్పవని సలహాలు ఇస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు