sarkaru vaari paata : సినిమా చూడకుండా ప్రభాస్ రివ్యూ ఎలా చెప్పేసాడబ్బా..!

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే మహేష్ అభిమానులకి కావాల్సిన ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేయదగ్గ కామెడీ, అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ కూడా ఉంది. కాబట్టి.. డీసెంట్ ఓపెనింగ్స్ నమోదవుతున్నాయి. అయితే ఈ సినిమా పై టాలీవుడ్ హీరోలు ఎవ్వరూ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా వేయడం లేదు అని మహేష్ అభిమానులు రగిలిపోతున్నారు.

మహేష్ అయితే అన్ని సినిమాలకి బాగుంది అని ట్వీట్లు వేస్తుంటాడు, మరి ‘సర్కారు వారి పాట’ కి ఒక్క హీరో ట్వీట్ వేసింది లేదు. అయితే ప్రభాస్ ఈ సినిమా చూసి.. సినిమా బాగుందని, మహేష్ కామెడీ టైమింగ్ అదుర్స్ అని రివ్యూ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఆయనకి నిర్మాతలు ప్రత్యేకమైన షో వేసినట్టు కూడా ఆ వార్తల్లో ఉంది.

కానీ వాస్తవానికి వచ్చేసరికి.. ప్రభాస్ ‘సర్కారు వారి పాట’ చూడలేదు. సినిమా చూడకుండా రివ్యూ ఎలా చెప్పేస్తాడు అని ఆయన సన్నిహిత వర్గం చెప్పుకొస్తోంది. ఇవన్నీ గాలి వార్తలు అని కూడా కొట్టిపారేసింది. ప్రభాస్ ఏ విషయం గురించైనా తన ఫేస్బుక్ పేజీ ద్వారా స్పందిస్తారు దయచేసి ఇలాంటి వార్తలు నమ్మొద్దు అని కూడా ప్రభాస్ సన్నిహితులు చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు