Hridayam: కొన్ని జ్ఞాపకాలు,ఇంకొన్ని కన్నీళ్లు

ఎన్నో సినిమాలను చూస్తాం
కొన్ని సంతృప్తి ను ఇస్తాయి,ఇంకొన్ని అసంతృప్తి ను ఇస్తాయి
కానీ అతి తక్కువ సినిమాలు మాత్రమే అనుభూతిని ఇస్తాయి.
సినిమా మొదలైనప్పటి నుండే ఒక మంచి సినిమా చూడబోతున్నామనే ఒక ఫీలింగ్ ను కొన్ని సినిమాలు మాత్రమే క్రియేట్ చేస్తాయి.
అచ్చం అలాంటి సినిమానే ఒన్ ఇయర్ బ్యాక్ వచ్చిన హృదయం.

ఇది ఒక మాములు కథ,
మనం చదవుకున్న కాలేజీ వాతావరణం,
మనం కలిసిన స్నేహితులు,
మనం గడిపిన క్షణాలు,
ఒక అందమైన అమ్మాయిని చూడగానే మనకు కలిగిన ఒక భావనను తట్టిలేపే సినిమానే ఈ “హృదయం”

భయానికి బాష అవసరం లేదు అని రాస్తాడు త్రివిక్రమ్.
అలానే భావోద్వేగానికి కూడా బాష అవసరం లేదు.
ఎందుకంటే ప్రేమ అనేది ఒక ఎమోషన్
ప్రేమ రెండక్షరాల మహాకావ్యం
రెండు కన్నీటి చుక్కల మహా సముద్రం
ప్రతి జీవి అన్వేషణ ప్రేమ కోసమే
ప్రతి జీవి నీరీక్షణ ప్రేమ కోసమే
ప్రేమ పుట్టుకకు కారణాలు లేవు
అది ఎప్పుడు పుడుతుందో ఎలా మొదలవుతుందో తెలియదు
అది ఒక అనంత దూరలా సుదీర్ఘ ప్రయాణం.
అని చెప్తాడు సుకుమార్.

- Advertisement -

అందుకే ప్రేమకథ చిత్రాలు ఏ భాషలో వచ్చినా వాటికి సరైన ఆదరణ లభిస్తుంది. దానికి గొప్ప ఉదహారణలు తమిళ్ లో వచ్చిన 96, మలయాళంలో వచ్చిన హృదయం సినిమాలు అని చెప్పొచ్చు.

హృదయం సినిమాలో అరుణ్ (ప్రణవ్ మోహన్ లాల్) కు దర్శన (దర్శన రాజేంద్రన్) I fell in love with u the moment i saw you అని చెప్తుంది. అలానే ప్రేక్షకుడు కూడా హృదయం సినిమాను చూసిన మరుక్షణమే ఆ సినిమాతో ప్రేమలో పడతాడు.

ఇందులో చూపించిన కాలేజ్ సీన్స్, రొమాన్స్, పెళ్ళి, రిలేషన్స్ ఇవన్నీ.. బోలెడన్ని సినిమాల్లో చూపించినవే, మనం ఎక్పీరియన్స్ చేసినవే.
కానీ ఈ సినిమాలో డైరెక్టర్ రాసుకున్న ప్రతీ సీన్, అందులోని యాక్టర్స్ వాళ్ళ వాళ్ళ ఎమోషన్స్ ని క్యారీ చేసిన విధానం. ఇవన్నీ ప్రేక్షకుడిని హత్తుకుంటాయి.

కేవలం ప్రేమను మాత్రమే కాకుండా స్నేహాన్ని , అనుబంధాలను చూపించడం కూడా ఈ సినిమా గొప్పతనం. ఈ సినిమాకి మ్యూజిక్ పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. మాములుగా సంగీతానికి రాళ్లు కరుగుతుంటాయి అని చెబుతారు. అది ఎంతవరకు నిజం అని పక్కన పెడితే,ఈ సినిమాలో సంగీతానికి మనసు కరుగుతుంది. వర్ణాతీతమైన ఒక అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా తీసిన దర్శకుడు “వినీత్ శ్రీనివాసన్” స్వతహాగా సింగర్ కావడంతో ఈ సినిమాలోని సాంగ్స్, బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తాయి.

మాములుగా వచ్చిన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తో కలక్షన్స్ ను కొల్లగొట్టింది. నేటితో ఒక ఏడాది పూర్తి చేసుకున్న ఈ సినిమాను చూడకుంటే, ఒకసారి హాట్ స్టార్ కి వెళ్లి చూసి తరించండి.

హృదయం ఇది కేవలం సినిమా కాదు
కొన్ని జ్ఞాపకాలు,ఇంకొన్ని కన్నీళ్ళ మిళితం💙

#1YearForHridayam🎬

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు