Hrithik Roshan: కాంతార గూస్ బంప్స్ తెప్పిస్తోంది

శాండిల్ వుడ్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన తాజా చిత్రం కాంతార. ముందుగా కేవలం కన్నడలోనే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తారు. దాదాపు అన్ని భాషల్లో కాంతార బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రూ. 400 కోట్లు వసూళ్లు చేసి, ఈ ఏడాది భారత దేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఇటీవల థియేట్రికల్ రన్ ను ముగించుకుని ఓటీటీలో విడుదలైన సంగతి విధితమే.

కాంతార ఓటీటీలో కూడా సంచలనాలను క్రియేట్ చేస్తోంది. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది సెలబ్రెటీలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంతార సినిమాపై స్పందించాడు. కాంతార సినిమా చాలా అద్భుతంగా ఉంది. చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలు నాకు గూస్ బాంప్స్ తెప్పించాయి.

అలాగే కాంతార సినిమాను చూసి నేను చాలా నేర్చుకున్నాను. రిషభ్ శెట్టి కథను చెప్పిన తీరు, కథనం, డైరెక్షన్ తో పాటు ఆయన నటన అత్యద్భుతం. సినిమా కోసం రిషభ్ చాలా కష్టపడ్డాడని సినిమాలోని కొన్ని సీన్స్ చూస్తే తెలిసిపోతుంది. రిషభ్ దృఢ సంకల్పం వల్లే కాంతార సినిమా ఇంత బాగా వచ్చింది అంటూ రిషభ్ ను కొనియాడారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు