Hunt : హాలీవుడ్ యాక్షన్ టచ్ తో..

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం.

‘హంట్’లో స్టంట్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయని, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’లో స్టంట్స్ కంపోజ్ చేశారు. మూవీలో అవి హైలైట్ అవుతాయని దర్శక నిర్మాతలు చెప్పారు.

హాలీవుడ్‌లో ‘జాన్ విక్ 4’ కి స్టంట్ కొరియోగ్రాఫర్స్ గా చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ఈ సినిమాలో భాగం కావడంతో సినిమాకు ప్లస్ అవుతుందని మూవీ టీం భావిస్తున్నారు. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హంట్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ పనులు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘పాపతో పైలం…’ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ భరత్ కూడా పోలీస్ పాత్రలు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు