Samyuktha: నాకు నచ్చిందే నేను చేస్తా

మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుసగా టాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త. ఈ చిత్రంలో రానా భార్యగా కనిపించి నటనపరంగా ప్రశంసలు అందుకుంది.

ఇక ఈ చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార చిత్రంలో కూడా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా ధనుష్ సార్ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవడంతో సంయుక్త రేంజ్ పెరిగింది.

ఇక ప్రస్తుతం విరూపాక్ష సినిమాలో సాయిధరమ్ తేజ్కు జోడిగా నటిస్తుంది ఈ అమ్మడు. అయితే హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటున్న సంయుక్త మీనన్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందని అంటున్నారు నేటిజెన్లు.

- Advertisement -

కారణం ఏంటంటే.. తాను ఆక్ట్ చేసిన సినిమాలు హిట్ కావడంతో “నేను రూల్స్ బుక్ ఫాలో కాను” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సంయుక్త.

తాజాగా సాంప్రదాయ పద్ధతిలో చీర కట్టుకొని.. వయ్యారాలు ఒలకబోస్తున్న ఫోటోని షేర్ చేసి ఈ కామెంట్ చేసింది. దీంతో రెండు హిట్ సినిమాలకే తాను మైండ్కి నచ్చినట్టుగా కాకుండా మనసుకు నచ్చినట్లుగా వెళ్లానని చెప్పడంపై నెట్టిజెన్లు కాస్త ఎక్కువ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు