Allu Arjun : బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం ?

ప్రతి సినిమాలో కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ముందుకు వస్తాడు అల్లు అర్జున్. సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ హీరో స్టైల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. పుష్ప సినిమాతో స్టైలీష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీతో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను అందుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఇప్పటి వరకు డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు అట్లీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అంటున్నాయి సినీ వర్గాలు.

తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “జవాన్“. కింగ్ ఖాన్ షారుక్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా మరో సారి అలరించబోతున్నారు. అయితే ఇంతమంది స్టార్స్ ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించబోతున్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ అట్లీ జవాన్ కోసం అల్లు అర్జున్ ను సంప్రదించినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలోని ఒక ఇంట్రెస్టింగ్ పాత్ర కోసం ఐకాన్ స్టార్ తో చర్చలు జరుగుతున్నాయట. అల్లు అర్జున్ కన్న ముందు ఈ పాత్ర కోసం దలపతి విజయ్ ని కూడా సంప్రదించారట అట్లీ. కొన్ని కారణాల వల్ల విజయ్ దలపతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దీంతో ఈ పాత్ర అల్లు అర్జున్ దగ్గరికి వచ్చిందని టాక్. ఈ సినిమాలో దీపికా పడుకొనె కూడా అతిధి పాత్ర కోసం సంప్రదించారట.

- Advertisement -

అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో అల్లు అర్జున్ చేరిపోతే, సినిమాపై భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అవడం ఖాయమని చెప్పొచ్చు. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ కోసం Filmifyను ఫాలో అవండి.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు