Indian 2: ఇండియాన్ 2 పోస్టుపోన్ అయ్యే అవకాశం ఉందా.?

Indian 2: తమిళ్ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో హిట్స్ సినిమాలను ఇండస్ట్రీకి అందించారు శంకర్. 17 సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన తర్వాత జెంటిల్మెన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఆ తర్వాత ఎన్నో హిట్ హిట్ సినిమాలు చేశారు శంకర్. శంకర్ కెరియర్ లో వచ్చిన సినిమాలు అన్నిట్లో కూడా భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. లంచం కాన్సెప్ట్ లో తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

Indian 2

భారతీయుడు 2 సినిమాని శంకర్ ఎప్పుడో స్టార్ట్ చేశాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. సినిమా ఆగిపోయే పరిస్థితి కూడా ఆల్మోస్ట్ వచ్చింది. సినిమా జరుగుతున్న సమయంలో ఫైర్ ఆక్సిడెంట్ జరగడం దాని వలన అసిస్టెంట్ డైరెక్టర్స్ చనిపోవడం ఇలా ఎన్నో అవంతరాలు ఈ సినిమాకు వచ్చాయి. ఈ సినిమా దాదాపు ఆగిపోతుంది అని అనుకున్నారు. ఈ సినిమా బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. లైకా ప్రొడక్షన్స్ తో పాటు దిల్ రాజు కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం ఉన్నారు. అయితే సినిమా లేట్ అవుతున్న కొద్ది ఈ సినిమా నుంచి దిల్ రాజు తప్పుకొని, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అదే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను తెరకెక్కించాడు.

- Advertisement -

అయితే ఇండియన్ సినిమాను జూలై 12న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా అన్ని పూర్తయ్యాయి. ఇకపోతే ఈ సినిమాను ప్రస్తుతం పోస్ట్ పోన్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం వినిపిస్తుంది. ఆగస్టు 15న పుష్ప సినిమా రిలీజ్ అవుతుందని ఇదివరకు అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా డిసెంబర్ నెలలకు వాయిదా పడింది. అయితే అదే డేట్కు ఇండియన్ టు సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు