Indian 2 Run Time : ఆఖరికి శంకర్‌కి కూడా ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎవరూ ఊహించలేదు భయ్యా

Indian 2 Run Time : ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురు చూసిన సినిమా ఇండియన్ 2. ఇక రీసెంట్గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. కల్ట్ స్టేటస్ ఉన్న భారతీయుడు అనే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉండేవి. అప్పట్లో ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని యాస్పెక్ట్స్ లోనూ ఆ సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆ సినిమా కాన్సెప్ట్, ఆ సినిమాలోని ఎమోషన్స్, ఆ సినిమా మ్యూజిక్ అన్నీ కూడా భారతీయుడు సినిమా హిట్ అవ్వడానికి కీలకపాత్రను వహించాయి.

భారతీయుడు టు విషయానికి వస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. వీటన్నిటిని మించి ఈ సినిమా లెంత్ దాదాపు మూడు గంటలకు పైగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ కు ఉన్న ఓపిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సినిమా ఏ మాత్రం ఆసక్తిగా లేకపోయినా కూడా జేబులో ఉన్న మొబైల్ తీసి చూసుకోవటం మొదలుపెట్టారు ఆడియన్స్.

ఇకపోతే సినిమా లెంత్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో మూడు గంటల పాటు నిడివి ఉన్న సినిమాలు చాలా వచ్చాయి అవి వర్కౌట్ అయ్యాయి కూడా. ఎందుకంటే ఆ సినిమాని అంత ఆసక్తికరంగా ఆయా దర్శకులు మలిచారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా డ్యూరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక సందీప్ రెడ్డి వంగ తీసిన అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ రెండు సినిమాలు కూడా దాదాపు మూడు గంటలకు పైగా ఉంటాయి. అందుకే ఒక సందర్భంలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. సినిమా డ్యురేషన్ వలన పోదు, కంటెంట్ వలన పోతోంది అంటాడు.

- Advertisement -

Shankar

ఇక ఇండియన్ 2 విషయానికి వస్తే కంటెంట్ తో పాటు, డ్యురేషన్ కూడా మైనస్. అందుకే ఈ సినిమా లోని ఒక 12 నిమిషాల పాటు ట్రిమ్ చేశారు చిత్ర యూనిట్. ఇకపోతే ఈ విషయంపై కొందరు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ పెడుతున్నారు ఇలాంటి జాగ్రత్తలు ముందు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 12 నిమిషాలు కట్ చేసినా కూడా సినిమా పైన పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు అని కొంతమంది చెబుతున్నారు. శంకర్ సినిమాకి ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు అనేది కొందరి అభిప్రాయం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు