Nani: దసరా.. ఈ రోజు బ్లాస్ట్ అవుతుందా.. ?

ఒక డైరెక్టర్ నుంచి వచ్చే మొదటి సినిమా ఎలా ఉంటుంది ? ఎన్నో అనుమానాలు.. ఎన్నో విమర్శలు.. మరిన్నో నెగిటివ్ టాక్స్. పడుతూ లేస్తూ ఉండే ప్రమోషన్స్. అంతకి మించి ఏం ఉంటుంది. కానీ, కుర్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నుంచి వస్తున్న మొదటి సినిమా దసరా.. పై వేవీ లేకుండా పాన్ ఇండియా స్థాయిలో హైప్ ను క్రియేట్ చేస్తోంది.

దసరా.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఎక్కడా చూసినా, ఎక్కడ విన్నా.. ఇదే వినిపిస్తోంది. ఒక డైరెక్టర్ నుంచి వచ్చే మొదటి సినిమాకు ఇంతటి హైప్ రావడం మామూలు విషయం కాదు. ఇందులో హీరో కూడా పెద్ద పాన్ ఇండియా స్టార్ కాదు. టాలీవుడ్ లో కుప్పలు కుప్పలుగా ఉండే టైర్ 2 హీరోల్లో ఒకరు. ఇలాంటి సందర్భంలో సినిమాపై వస్తున్న అంచనాలను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

నిజానికి ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇంతటి హైప్ లేదు. ఏదో ప్రతి వారం వచ్చే సినిమాలా.. ఈ సినిమా కూడా రాబోతుంది అని అనుకున్నారు. కానీ, ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌లు, పోస్టర్లు అంచనాలను మెల్లి మెల్లిగా పెంచాయి. ఇక పాటలు.. ఆ తర్వాత వచ్చిన టీజర్.. సినిమాపై బజ్ ను నేషనల్ లెవెల్ లో క్రియేట్ చేశాయి. మార్చి 30న శ్రీకాంత్ ఓదెల, నాని దసరా మూవీతో ఏదో సాధించబోతున్నారు.. అనే భావనను ప్రేక్షకుల్లో కలగజేశారు.

- Advertisement -

ఈ రోజు సాయంత్రం 4:59 కి దసరా మూవీ నుంచి ట్రైలర్ రాబోతుంది. వచ్చే ట్రైలర్ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ, ట్రైలర్ అనౌన్స్‌మెంట్ తోనే కావాల్సినంత హైప్ క్రియేట్ అయింది. ట్రైలర్ అనౌన్స్ పోస్టర్ కూడా ఓ రేంజ్ లో ఉందంటూ ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా నాని ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ లో శ్రీకాంత్ ఓదెలతో నాని.. ట్రైలర్ మిక్స్ ఎలా ఉంది అని అడిగారట. దీనికి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. “బ్లాస్ట్ అవుతుంది అన్నా.. ఈ రోజు” అని అన్నారట.

ప్రస్తుతం ఈ ట్వీట్.. శ్రీకాంత్ ఓదెల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు