Pawan Kalyan: సినిమాలో అలీ మళ్లీ నటిస్తున్నాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఎంతో మంచి స్నేహితులు అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించే దాదాపు అన్ని సినిమాల్లో అలీ కనిపించే వాడు. అయితే వీరి స్నేహానికి గత కొన్ని రోజుల బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. దానికి కారణం రాజకీయాలు. వైసీపీలో కమెడియన్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో పదునైనా మాటలతో ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా ఓ సందర్భంలో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోటీ చేస్తానని కామెంట్ చేశాడు.

ఈ కామెంట్ తర్వాత పవన్ కళ్యాణ్, అలీ మధ్య దూరం ఇంకా పెరిగిందని టాక్ వచ్చింది. అయితే తాజాగా అలీ.. పవన్ తో ఉన్న రిలేషన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాను పవన్ కళ్యాణ్ ను ఏడాదిన్నర తర్వాత కలిశానని తెలిపాడు. ఇద్దరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నామని, త్వరలో మళ్లీ కలుద్దామని అనుకున్నట్లు తెలిపారు. అలాగే తమ మధ్య రాజకీయంగా దూరం వచ్చింది కానీ, వ్యక్తిగతంగా తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు.

తమ మధ్య ఎదో జరిగింది అని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఇది మీడియా సృష్టియే అని అన్నారు. అలాగే తాను ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించబోతున్నట్టు కూడా చెప్పుకొచ్చాడు. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమల్లు, వినోదయ సీతం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు చేస్తున్నాడు. అలీ హీరోగా లాయర్ విశ్వనాథ్ అనే సినిమా చేశాడు. ప్రస్తుతం ఇది రిలీజ్ కు ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు